రౌడీషీటర్ల జీవనభృతికి ఉద్యోగాలు

 


వినూత్న రీతిలో రౌడీషీటర్లకు జాబ్ మేళా నిర్వహించిన పోలీస్ కమిషనర్

(రాజన్ – జనహృదయం)

ఏపి రాజ‌ధానిలో రౌడీయిజం త‌గ్గించేందుకు వినూత్నంగా ఆలోచించారు అక్క‌డి పోలీస్ క‌మీష‌న‌ర్‌. ఏళ్ల‌త‌ర‌బ‌డి రౌడీయిజ‌మే వృత్తిగా చ‌లామ‌నీ అవుతున్న వారిని ఎంత‌క‌ఠినంగా శిక్షించినా ఎన్నిసార్లు క‌ట‌క‌టాల వెన‌క్కి పంపినా ప్ర‌యోజ‌నం శూన్య‌మే అవుతూ మ‌ళ్లీ వారు మ‌రింత రాటుదేలుతూ నేరవృత్తి కొన‌సాగిస్తున్న‌విష‌య‌మై ప్ర‌త్యామ్నాయ మార్గాన్నిఅన్వేషించారు. ఈమేర‌కు విజ‌య‌వాడ సిపి క్రాంతిరాణా టాటా రౌడీషీట‌ర్ల‌కు ఉద్యోగాలు ఇప్పించి జీవ‌న‌పాది క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
రాజ‌ధానిలో రౌడీయిజం త‌గ్గించాలంటే వారిలో మార్పుతీసుకురావ‌డంతోపాటు వారి జీవ‌నోపాధికి ప్ర‌త్యామ్నాయంగా జీవ‌న‌భృతి క‌ల్పించాల‌నే వినూత్న ఆలోచ‌నతో సిపి ఉద్యోగ‌మేళా నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం. దీనికోసం నైపుణ్యాభివృద్ధి కార్పొరేష‌న్ సాయంతో రౌడీషీట‌ర్ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈమేర‌కు విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌రేట్ మ‌రియు నైపుణ్యాభివృద్ధి కార్పొరేష‌న్ సంయుక్తంగా జాబ్‌మేళా నిర్వ‌హించారు. సుమారు 16కంపెనీల‌తో ఈ జాబ్‌మేళా నిర్వ‌హించారు. ఈ మేళాలో విజ‌య‌వాడకు చెందిన రౌడీషీట‌ర్లు అధిక సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. దీంతో విజ‌య‌వాడ‌లో భ‌విష్య‌త్ లో రౌడీయిజం త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.
ఈ సంధ‌ర్బంగా సిపి క్రాంతిరాణా టాటా మాట్లాడుతూ విజ‌య‌వాడ‌లో రౌడీ షీట‌ర్ల స‌మస్య చాలా కాలంగా ఉంద‌ని వారిలో మార్పుతీసుకువ‌చ్చేందుకు అనేక ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని అయితే వారికి ప్ర‌త్యామ్నాయ జీవ‌నోపాధి లేద‌ని భావించి ఈ జాబ్‌మేళా నిర్వ‌హించి మార్పుకోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా