రౌడీషీటర్ల జీవనభృతికి ఉద్యోగాలు

వినూత్న రీతిలో రౌడీషీటర్లకు జాబ్ మేళా నిర్వహించిన పోలీస్ కమిషనర్ (రాజన్ – జనహృదయం) ఏపి రాజధానిలో రౌడీయిజం తగ్గించేందుకు వినూత్నంగా ఆలోచించారు అక్కడి పోలీస్ కమీషనర్. ఏళ్లతరబడి రౌడీయిజమే వృత్తిగా చలామనీ అవుతున్న వారిని ఎంతకఠినంగా శిక్షించినా ఎన్నిసార్లు కటకటాల వెనక్కి పంపినా ప్రయోజనం శూన్యమే అవుతూ మళ్లీ వారు మరింత రాటుదేలుతూ నేరవృత్తి కొనసాగిస్తున్నవిషయమై ప్రత్యామ్నాయ మార్గాన్నిఅన్వేషించారు. ఈమేరకు విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా రౌడీషీటర్లకు ఉద్యోగాలు ఇప్పించి జీవనపాది కల్పించేందుకు చర్యలు చేపట్టారు. రాజధానిలో రౌడీయిజం తగ్గించాలంటే వారిలో మార్పుతీసుకురావడంతోపాటు వారి జీవనోపాధికి ప్రత్యామ్నాయంగా జీవనభృతి కల్పించాలనే వినూత్న ఆలోచనతో సిపి ఉద్యోగమేళా నిర్వహించడం అభినందనీయం. దీనికోసం నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సాయంతో రౌడీషీటర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు విజయవాడ పోలీస్ కమీషనరేట్ మరియు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా జాబ్‌మేళా నిర్వహించారు. సుమారు 16కంపెనీలతో ఈ జాబ్‌మేళా నిర్వహించారు. ఈ ...