లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం



 కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

ఢిల్లీ :  కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతుందని అన్ని వర్గాల అభివృద్ధి కోసం, జీవనోపాధి దృష్ట్యా రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పారిశ్రామిక అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని నిర్మల సీతారామన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు తెలిపారు. కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న  నేపథ్యంలో రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థిితులను అధిగమించేందుకు కరోనా సెకండ్ వేవ్ ను అరికట్టేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తారని పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చాాారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా