కరోనాతో వస్త్ర వ్యాపారి మృతి .. నర్సీపట్నంలో



 నర్సీపట్నం : రెవెన్యూ  డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఎస్. వి. ఆర్. షాపింగ్ మాల్ యజమాని సత్తిబాబు కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. వారం రోజుల కిందట సత్తిబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందారు. మృతుడు సత్తి బాబు గత ఏడాది కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న బాధితులకు పలు సహాయ, సహకారాలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి కరోనాతో మృతి చెందడం పట్ల పట్టణ వాసులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.కాగా వస్త్ర వ్యాపారి సత్తిబాబు మృతి వార్త నర్సీపట్నంలో విషాదాన్ని నింపింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా