లాక్ డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి ...

ప్రజల్లో యువత చైతన్యం కలిగించాలి... ప్రధాని మోడీ పిలుపు



 డిల్లి :  దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న నేపధ్యంలో ప్రజా చైతన్యమే పరమావధిగా భావించిన ప్రధాని మోడీ యువతరాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశారు.  యువత కరోనా కట్టడికి సహకరించాలంటూ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పిలుపునిచ్చారు.  ఆయన ప్రసంగం ఈ విదంగా సాగింది.

 "కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మనందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందాం.  మరోసారి మహమ్మారి పై భీకర యుద్ధం చేస్తున్నాం. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదు.  ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉంది.  ఆక్సిజన్ రైలు దేశమంతా ఆక్సిజన్ ను అందిస్తుంది.  తీవ్రంగా ఉన్న  ఆక్సీజన్ సమస్య ను  పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా కృషి కృషి చేస్తుంది.   జనవరి, ఫిబ్రవరి కంటే ప్రస్తుత అవసరాల దృష్ట్యా  మందుల ఉత్పత్తి పెంచాం. మన దేశంలో బలమైన ఫార్మా సెక్టార్ ఉంది. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ను తయారు చేసుకొని, ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో ఇప్పటివరకు  12 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాం.  మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికి వ్యాక్సిన్ అందిస్తాం.

గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం కాస్త మెరుగయ్యాం . అవసరమైన వారికి సాయం అందించేందుకు దేశమంతా ఒక్కటి కావాలి. ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలి.  యువకులు భాద్యత తీసుకొని ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు ఆచరించేందుకు తోడ్పాటు అందించాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈ విదంగా యువత సహకరిస్తే  లాక్ డౌన్ పెట్టుకునే పరిస్థితి రాదు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడేందుకు యువత సహకరించాలి. ఇప్పట్లో ఎటువంటి లాక్ డౌన్ ఉండదు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలి. లేకుంటే పరిస్థితి భయానకంగా మారుతుంది." అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా