ఏపీలో కరోనా కట్టడికై నేడు కీలక సమావేశం
అమరావతి (జనహృదయం) : ఏపీలో కరోనా కేసులు భయోత్పానికి గురిచేస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎం జగన్ నేతృత్వంలో నేడు హై లెవల్ కమిటీ సమావేశమవనుంది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణపై పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
కరోనా నియంత్రణపై పూర్తి భాద్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ తరుణంలో ఏపీలో కరోనా రోజు రోజుకి ఉదృతం అవుతుండడంతో కఠిన నిర్ణయాలతో కట్టడి చేయకుంటే పెను ప్రమాదమే. దీనిని ముందుగా గుర్తించిన జగన్ సర్కార్ కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం చేస్తోంది. పాఠశాలల్లో విద్యార్థులు సైతం కరోనా బారిన పడడంతో టెన్ పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షలు వాయిదా పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటుగా దేవాలయాలు, మత సంస్థలతో పాటుగా బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు, రాష్ట్రంలో నైట్ కర్వ్ఫూ , మార్కెట్లు, దుకాణాల విషయంలో ఆంక్షలు విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
మరో వైపు కోవిడ్ కట్టడికోసం వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వ్యాక్సినేషన్ వివరాలతో వైద్యాధికారులకు ఓ యాప్ ను కూడా నేడు విడుదల చేయనున్నారు. అలాగే కరోనా మొదటి దశలో వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించి కరోనా కేసుల ఉదృతిని అరికట్టిన అనుభవంతో ఈ దిశగా సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగా నేడు ఏపీలో జరగనున్న హై లెవెల్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ ఎటువంటి కీలక ప్రకటనలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఏ నిర్ణయమైనా కరోనా కట్టడికే కాబట్టి కష్టమైనా ప్రజలు అవగాహనతో ఎవరి ప్రాణాలపై వారు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదు కాబట్టి ప్రజలంతా కరొనా నియంత్రణకు నడుంబిగిచాల్సిన తరుణం ఆసన్నమైంది.
Comments
Post a Comment