శ్రీవారి దర్శనాలపై కరోనా ప్రభావం
తిరుమల : కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలపై కూడా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే పలు ఆలయాలలో భక్తుల దర్శనాలు నిలిచిపోగా, తాజాగా కరోనా ఉధృతి దృష్ట్యా శ్రీవారి దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల జారీని పాలకమండలి రద్దు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను 30 వేల నుంచి 15 వేలకు కుదిస్తున్నట్లు ప్రకటించింది. రూ.300 దర్శన టికెట్లను ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీపేర్కొంది.
Comments
Post a Comment