కరోనా కట్టడి కోసం వైద్యులకు యాప్ ... సీఎం జగన్
అమరావతి : ఏపీ లో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న అయిదు లక్షల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ రెండో డోసు అందించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఈ నెల 19వ తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుందని సీఎం జగన్ తెలిపారు. వైద్యాధికారులందరూ లబ్ధిదారుల వివరాలను ఎప్పుటికప్పుడు ఈ యాప్ లో నమోదు చేయాలని, దీనికోసం వైద్యాధికారులందరూ తమకు వైద్య ఆరోగ్యశాఖ కేటాయించిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఉపయోగించాలని కోరారు.
ఈ యాప్ ద్వారా లాగిన్ అయ్యే వైద్యాధికారికి కరోనా టీకా పొందని వారి వివరాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తమకు నిర్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు సూచించారు. కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Comments
Post a Comment