విశాఖ జిల్లాలో మరో 565 పాజిటివ్ కేసులు
విశాఖపట్నం: జిల్లాలో తాజాగా సోమవారం 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కరోనా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బి వి సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 69,012 కేసులు నమోదు కాగా వీటిలో ప్రస్తుతం 64,128 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా కరోనా వ్యాధితో జిల్లాలో ఇద్దరు మృత్యువాత గురయ్యారని ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు
Comments
Post a Comment