ఒకే పాఠశాలలో 52 పాజిటివ్ కేసులు...
పాఠశా లను మూసివేసిన అధికారులు
కర్నూలు : జిల్లా లోని ఆదోని శివారు కస్తూర్బా పాఠశాలలో కరోనా బారిన పడుతున్న విద్యార్థినుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం పాఠశాలలో 300 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 52 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 50 మంది విద్యార్థినులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 4 రోజుల క్రితం ఇదే పాఠశాలలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 15 మంది విద్యార్థినులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. తాజాగా పాఠశాలలో మరోసారి విద్యార్థినులు, సిబ్బంది కరోనా బారిన పడటంతో పాఠశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత వారం రోజుల వ్యవధిలో ఆదోని మున్సిపాలిటీ పరిధిలోనే 182 కేసులు నమోదయ్యాయి.
Comments
Post a Comment