ఎపిలో 24 గంటల్లో 8,987 మందికి కరోనా పాజిటివ్
నిర్లక్ష్యం తగదు, పరిస్తితి విషమిస్తోంది, ఎవరికి వారు చైతన్యం కావాలి, ప్రజల్ని ప్రభుత్వం కట్టడి చేయడం కాదు ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకొని కరోనా నియంత్రణకు నడుం బిగించాలి...
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ భయోత్రాపాతా న్ని సృష్టిస్తోంది. రా ష్ట్రంలో గత 24 గంటల్లో 37,922 శాంపిల్స్ ను పరీక్షించగా 8,987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే గడిచిన 24 గంటల్లో మరో 35 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా వల్ల నెల్లూరులో 8 మంది, చిత్తూర్ లో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కృష్ణ జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 3,116 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మంగళవారం వరకు రాష్ట్రంలో 1,57,53,679 శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా ... విశాఖపట్నం 675, విజయనగరం 330, శ్రీకాకుళం 1344, ఈస్ట్ గోదావరి 851, పశ్చిమ గోదావరి 99, కృష్ణ 441, గుంటూరు 1202, చిత్తూరు 1063, కడప 297, కర్నూల్ 758, నెల్లూరు 1347, అనంతపూర్ 275, ప్రకాశం 305 జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యా యి. టెస్టు చేసిన ప్రతీ నలుగురిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Comments
Post a Comment