మాస్క్ లేకుంటే 10 వేలు జరిమానా ....
మొదటిసారి వెయ్యి, రెండోసారి 10 వేలు... ఉత్తర్ ప్రదేశ్లో
విశాఖపట్నం : ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిన్చకుంటే కరోనా కట్టడి సాధ్యం కాని పరిస్తితులు కళ్ళెదుట కనిపిస్తున్న కరోనా మరణాలు, పెరుగుతున్న పాజిటివ్ కేసుల లెక్కలు లెక్కచేయని వైనం... ఎందాకకా పోతుందోనన్న భయం క్షణ క్షణం వెంటాడుతోంది. ఈ తరుణంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అని ప్రకటించిన ప్రభుత్వాలు మాస్క్ పెట్టుకోని వారికి జరిమానాలు కఠినతరం చేసాయి.
దీనిలో భాగంగా దేశంలోని మాస్క్ పెట్టుకోనందుకు చాలా మంది ప్రజలకు, అధికారులు వెయ్యి రూపాయల వంతున జరిమానాను విధించాయి. అయితే కొందరు ఈ జరిమానాలు విధించినప్పటికీ బేఖాతరు చేస్తుండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మాస్క్ లేకుండా రెండోసారి పట్టుబడితే 10 వేల రూపాయలు జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలా మాస్క్ లేకుండా రెండోసారి అధికారులకు చిక్కిన అమర్జిత్ యాదవ్ అనే వ్యక్తి. దేశంలోనే ఈ రకంగా పది వేల రూపాయలు జరిమానా చెల్లించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. యూపీలోని డియోరియా పట్టణంలో అతడికి పోలీసులు రూ. 10000 జరిమానా విధించారు.
ఇదే తరహాలో దేశవ్యాప్తంగా కఠిన నిర్ణయాలు చేపట్టకుంటే జనం కరోనా బారిన పడి ఆసుపత్రుల పాలైనా , మృత్యు వాతాకు గురైనా వందల్లో సంభవిస్తున్న మరణాలు వేల సంఖ్యకు చేరితే ఎవరు భాద్యులు మన నిర్లక్ష్యానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాలా, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించారా? ఓ వైపు ప్రభుత్వాలు, మరో వైపు ప్రజలు ఎవరి భాద్యతలు వారు నిర్వర్తించాలి.
Comments
Post a Comment