ఎనిమిది కోట్ల నకిలీ నోట్ల గుట్టు రట్టు



 ఓడిశాలో పట్టుబడ్డ  దొంగ నోట్ల కట్టలు...

 పోలీసుల చేతికి చిక్కిన (విశాఖ  చేరాల్సిన) ఎనిమిది కోట్ల నకిలీ నోట్లు...

విశాఖపట్నం (జనహృదయం):   ఒడిశా నుంచి విశాఖకు భారీ ఎత్తున తరలిస్తున్న డబ్బు సంచులను స్వాధీనం చేసుకొని ఓ  ముఠాను  ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ డబ్బు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంకు తరలిస్తున్నట్లుగా తమ విచారణలో  గుర్తించారు.   ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారును చెక్ చేయగా పోలీసులకు మతిపోయినంత పనైంది. కారులో కొన్ని బస్తాల్లో రూ. 500 నోట్ల డబ్బు కట్టలు లభించాయి. అయితే ఇవి నకిలీ కరెన్సీగా పోలీసులు తేల్చారు. ఈ నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు కోరాపుట్‌ ఎస్పీ గుంటుపల్లి వరుణ్‌ తెలిపారు.

ఈ ముఠా సబ్యుల విచారణలో  షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.  ఓడిశా పోలీసులు   డబ్బు మొత్తం నకిలీ నోట్లుగా తేలింది. తాము స్వాధీనం చేసుకున్న మొత్తం నకిలీ నోట్ల విలువ రూ.7.90 కోట్లుగా ఉంటుందని ప్రకటించారు.  నకిలీ నోట్లు తరలిస్తున్న కారుకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉందని ఎస్పీ గుంటుపల్లి వరుణ్‌ తెలిపారు. రూ.500 నోట్లను పెద్ద బస్తాల్లో తరలిస్తున్నారని తెలిపారు. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ వెల్లడించారు.

ఎన్నికల వేళ ఈ సంఘటన  విశాఖపట్నంలో సంచలనం సృష్టించి కలకలం రేపుతోంది.   సుమారు రూ. 8 కోట్ల విలువున్న నకిలీ నోట్లు మార్కెట్ లోకి వచ్చి ఉంటె పరిస్తితి  ఏమిటన్న ఆందోళన నెలకొంది.   ఈ ముఠా వెనుక ఎవరువరు ఉన్నారు,   ఇలా నకిలీ నోట్లు ఎన్ని సార్లు  మార్కెట్లోకి ప్రవేశపెట్టారు  అనే కోణాల్లో పోలీసుల విచారణ సాగి నకిలీ నోట్ల ముఠా గుట్టు బట్టబయలు చేయాల్సి  ఉంది.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా