ఏపీలో దేవతా విగ్రహాలపై దాడులు
విజయవాడ : విజయవాడలోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న సీతారామ మందిరంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఏపీలో దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే తాళం వేసి ఉన్న మందిరంలోని సీతమ్మవారి విగ్రహం ధ్వంసమై ఉంది. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పని చేశారా.? లేక విగ్రహం కిందపడి పగిలిపోయిందా.? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment