తల్లి పక్కలోంచి తెల్లారేసరికి బిడ్డ మాయం..

 హైదరాబాద్: ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తున్న జంట. యాచనే వారి జీవనాధారం. నెల రోజుల క్రితం ఆ దంపతులకు ఓ పండంటి బాబు పుట్టాడు. వారిని రోజూ గమనిస్తున్న ఓ వ్యక్తి వారి వద్దకు ఓ ఆఫర్ తో వచ్చాడు. ’మీ అబ్బాయిని నాకివ్వండి. మీరు జీవితంలో సంపాదించలేనంత డబ్బు ఇస్తా.‘ అని ఆఫర్ ఇచ్చాడు. దానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. సరే మీ ఇష్టమంటూ అతడు వెళ్లిపోయాడు. కానీ ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ బిడ్డ మాయమయ్యాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ మొదలు పెట్టి సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఓ షాకింగ్ నిజం బయటకొచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యాచించడమే జీవన వృత్తిగా బతుకుతున్న ఓ జంట, హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఫుట్ పాత్ లపై ఉంటోంది. ఒక చోట స్థిరంగా ఉండకుండా నెలకోసారి ప్రాంతం మారుతూ యాచన చేస్తున్నారు. వీరికి ఓ నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. ఈ జంటను కొద్ది రోజులుగా గమనిస్తున్న ఓ వ్యక్తి ఓ రోజు వారి వద్దకు వచ్చాడు. ‘మీకు 70 వేల రూపాయలు ఇస్తా. ఈ బాబును నాకివ్వండి. పెద్ద పెద్ద ఇళ్లల్లో వాళ్లకు పిల్లలు లేక బాధపడుతున్నారు. మీ బాబు వాళ్ల ఇళ్లల్లో పెరుగుతాడు. రిచ్ లైఫ్ గడుపుతాడు. నా మాట వినండి. మీ అబ్బాయికి బంగారు భవిష్యత్ ఉంటుంది. మీ వద్దే ఉంటే మీ లాగే ఆ పిల్లాడు కూడా తయారవుతాడు. ఆలోచించండి‘ అంటూ హితవచనాలు పలికాడు. అది నచ్చిన ఆమె అతడిని పంపించేసింది.

కానీ ఆమె భర్తకు మాత్రం అంత డబ్బు పేరు వినగానే ఆశపుట్టింది. అతడిని మళ్లీ సంప్రదించాడు. 70వేలు ఇస్తే తాను బాబును తెచ్చిఇస్తానని చెప్పాడు. అన్నట్టుగానే ఓ రోజు రాత్రి తల్లి పడుకుని ఉండగా బాబును ఆమె నుంచి దూరంచేసి అతడికి ఇచ్చేశాడు. బాబు పక్కన లేకపోవడంతో ఆమె కంగారు పడి వెంటనే పోలీసులను సంప్రదించింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును పరిష్కరించారు. అతడి తండ్రే 70 వేలకు బాబును అమ్మేశాడని తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాబును సంరక్షించి శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా