అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు కు కృషి…..
నర్సీపట్నం: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం విచ్చేసిన ఆయనను ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు అంశంపై మాట్లాడి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా మంత్రిని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అక్రిడిటేషన్ గడువును పొడిగిస్తూ వచ్చారు తప్ప నూతనంగా అక్రిడేషన్ కార్డు ఇవ్వలేదని, ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు సైతం జర్నలిస్టులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారని మంత్రి కి తెలిపారు. జర్నలిస్టు సంఘాలు లేకుండా కమిటీ వేశారని ,దీనిపై ఒకసారి పునరాలోచన చేసి అధికారుల కమిటీని రద్దు చేసి, జర్నలిస్టు సంఘాల కమిటీ నియమించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు సౌకర్యం కల్పించాలని మంత్రి ని కోరారు.
అదేవిధంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ,ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు,ఇళ్ల స్థలాల విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
Comments
Post a Comment