విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ
నర్సీపట్నం నియోజక వర్గం..
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా శనివారం నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ మాకవరపాలెం మండలం పైడిపాల , పెద్దిపాలెం, బురుగు పాలెం, తడపాల, తూటిపాల గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు వైయస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతున్నదన్నారు. అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ రాణి అమ్మాజి, ఇతర రెవిన్యూఅధికారులు ,సిబ్బందిహాజరయ్యారు.
చోడవరం నియోజక వర్గం..
చోడవరం నియోజక వర్గ శాసన సభ్యులు కరణం ధర్మ శ్రీ శనివారం రోలుగుంట మండలం కొంత్లాం, అడ్డ సరం, కంచుగుమ్మల, శరభ వరం, లోసంగి గ్రామాలు,
రావికమతం మండలం మెడివాడ,పి పొన్నవోలు, టీ అర్జాపురం, గర్నికం, రావికమతం, జి. చీడిపల్లి గ్రామాలకు చెందిన లబ్ది దారులకు ఇళ్ళ స్థల పట్టాలను అందజేశారు.
రోలు గుంట, రావికమతం మండల తాసిల్దర్లు క్రిష్ణ మూర్తి, కనకారావు, ఇతర రెవెన్యూ అధికారులు సిబ్బంది హాజరయ్యారు.
పాయకరావు పేట నియోజక వర్గం..
పాయకరావు పేట నియోజక వర్గ శాసన సభ్యులు గొల్ల బాబూరావు శనివారం నక్కపల్లి మండలం చిన తీనార్ల, సిహెచ్ ఎల్ పురం, జానకయ్య పేట గ్రామాలు.
పాయకరావుపేట మండలం ఎస్ నర్సాపురం, శ్రీ రాంపురం గ్రామాలకు చెందిన లబ్ధి దారులకు ఇళ్ళ స్థల పట్టాలను పంపిణీ చేశారు.
నక్క పల్లి, పాయకరావుపేట మండల తాసిల్దర్ లు వి వి రమణ, పి అంబెద్కర్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
Comments
Post a Comment