అక్క చెల్లెమ్మలకు సొంత గూడు ప్రభుత్వ లక్ష్యం
నర్సీపట్నం : నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో భాగంగా ఆదివారం పాయకరావుపేట నియోజక వర్గం కోటవురట్ల మండలం పాములవాక, పీ కే పల్లి, చినబొ డ్డేపల్లి , ఆకసాహెబ్ పేట గ్రామ పంచాయతీ లకు చెందిన 211 మంది సొంత ఇళ్లు లేని అర్హులైన పేద లబ్ది దారులకు స్థల పట్టాలను రెవెన్యూ శాఖా మాత్యులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు కావలసిన అవసరాలను అడగకుండానే తీరుస్తూ ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారన్నారు. అర్హులందరికీ వైయస్సార్ జగన్ అన్న కాలనీలలో ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు, ఇంటి నిర్మాణాలను చేపట్టి గ్రామగ్రామాన పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నారన్నారు . ప్రతి నిరుపేద కుటుంబంలో ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని నవరత్నాలలో సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటికి స్థలాలను ఇస్తున్నారని, అంతే కాకుండా వాటి నిర్మాణాలను కూడా చేపట్టి మహిళ లను ఇంటి యజమానులుగా చేస్తున్నారన్నారు.
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్య వైద్య రంగాలకు కూడా ప్రాముఖ్యత కల్పిస్తూ పలు అభివృద్ధి పథకాలను అందిస్తున్నారన్నారు. గ్రామాలలోనూ పట్టణాలలోనూ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పారదర్శకంగా పరిపాలనను కొనసాగిస్తున్నార న్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తూ దేశంలో సమర్ధుడైన మూడో ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు.
రానున్న రోజులలో మొదటి స్థానంలో నిలుస్తారని ఆశిస్తున్నానన్నారు. వ్యవసాయ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ను అందించడం ద్వారా వారికి ఆర్థిక చేయూత నిస్తున్నారన్నా రు. అమ్మఒడి, పింఛన్లు , ఆరోగ్యశ్రీ తో పాటు పలు రకాల పథకాలను అర్హులందరికీ చేరే విధంగా అమలు చేస్తున్నారన్నారు.
బీసీల సంక్షేమం కోసం 56 రకాల బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్లను , డైరెక్టర్లను నియమించిన ఘనత ముఖ్యమంత్రి దేని అన్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అనుకున్న లక్ష్యాలను సాధించి భారత ప్రధాని చేత ప్రశంసలు పొందారన్నారు. నివర్ తుపానుకు పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తూ ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేశారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పాములవాక గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ పనుల నిమిత్తం రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు.
అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి వి సత్యవతి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, మహిళలందరినీ లక్షాధికారులగా చేస్తూ వారి పేరునే ఇంటి స్థలం ఇస్తున్నారని మనమందరం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పాములవాక గ్రామం లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి , సోలార్ లైట్లు ఏర్పాటుకు ఎంపీ ల్యాండ్ నిధుల నుండి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ ఈరోజు ఎంతో శుభ దినం అనీ ,ఇళ్ల పట్టాల పండుగ సంక్రాంతికి ముందే వచ్చిందని, నివసించేందుకు సొంతఇల్లు అనే స్థి రాస్తి సంపాదించుకోలేమనే బాధ నుండి ఊరట లభించిందన్నారు.
నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం లో సుమారు 1507 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో పాములవాక , పీకే పల్లి , చిన్న బొడ్డేపల్లి, అకా సాహెబ్ పేట గ్రామ పంచాయతీలలో 211 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థల పట్టాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులై ఉండి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సంబంధిత గ్రామ , వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి 90 రోజుల లోపల అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ప్రత్యేక అధికారి విశ్వేశ్వరరావు , కోట వురట్ల తహసీల్దార్ బి రామారావు, మాజీ ఎమ్మెల్సీ డి వి సూర్య నారాయణ రాజు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
Comments
Post a Comment