రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో 12 మంది అనుమానితులను అరెస్

 


విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ రామతీర్థం ఆలయానికి వచ్చి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రుల బందోబస్తుకు వచ్చిన జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఈ ఘటనకు సంబంధించి మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.

రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రస్తుతం దేవస్థానం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 12 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఈ అరాచకానికి పాల్పడ్డ దుండగులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. దీని వెనుక ఎంతటి వారున్నా శిక్ష తప్పదని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా