విశాఖలో ఉగాది నుండి ప్రారంభం కానున్న ఎగ్జిక్యూటి క్యాపిటల్
అమరావతి : ఏప్రిల్ 13 ఉగాది. ఉగాది పురస్కరించుకొని విశాఖ పరిపాలన రాజధాని ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఉన్నతాధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో ఉన్న కేసులు అన్నీ ఏప్రిల్ నాటికి తీరిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని తరలింపునకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ముహూర్తం ఫిక్స్ చేసింది. 2021 ఉగాది నుంచి మార్చాలని డిసైడైంది.
ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉగాది నుంచి ప్రభుత్వం పరిపాలనా రాజధాని విశాఖకు తరలించాలని నిర్ణయించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం అందుకోసం చట్టం తీసుకొచ్చింది.
ఆ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా పలుమార్లు రాజధాని తరలింపునకు సంబంధిచిన ప్రచారం జరిగింది. అయితే, అది వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి ఉగాదికి కచ్చితంగా మార్పు ఖాయమని భావిస్తున్నారు.
Comments
Post a Comment