పేదలందరికీ ఇల్లు
విశాఖపట్నం: పేదలందరికీ గూడు కల్పించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట – పినగాడి రోడ్, చీమలాపల్లి గ్రామంలో ఉన్న మీనాక్షి కన్వెన్షన్ లో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ , రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని..పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను అందించారు. ముందుగా కార్యక్రమాలను పురస్కరించుకొని వేపగుంట జంక్షన్ లో అధిక సంఖ్యలో జనం ఘన స్వాగతం పలికారు.
అనంతరం *స్వర్గీయ డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి* విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభాప్రాంగణం (మీనాక్షి కన్వెన్షన్) వరకు భారీ బైక్ రాలీ నిర్వహించారు. ఇళ్ల పట్టాలు పంపిణీ అనంతరం ..శ్రీరాంపురం గ్రామం కొనేరులో శ్రీశ్రీశ్రీ శివ, పార్వతుల విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అదీప్ రాజ్, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.
Comments
Post a Comment