ఏపీలో స్థానిక సమరంరానికి మోగిన నగారా

 



విజయవాడ: ఏపీలో ‌ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు. 

  నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్టు రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగం రచించిన అంబేడ్కర్‌ మానసపుత్రికే ఎన్నికల సంఘం. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్‌ విధి. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. నిన్న హాజరు కావాలని కోరినా అధికారులు రాలేదు. మధ్యాహ్నం 3గంటలకు సీఎస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి హాజరుకావాలని కోరాం’’ అని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.

 




Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా