ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

(ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపు) నర్సీపట్నం(జనహృదయం): ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని నర్సీపట్నం శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో భాగంగా గురువారం నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం అర్బన్ బలిఘట్టం,సుబ్బారాయుడు పాలెం గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు బైపురెడ్డిపాలెం వైయస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు, కుల మతాల కతీతంగా లక్షల మంది సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతున్నదన్నారు. అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. రానున్ననూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ లలో ప్రతీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాల ను మంజూరు చేయడం జరిగిందని, అర్హత ఉండి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తులు చేసుకొనవచ్చుననీ వాటిని పరిశీలించి 90 రోజుల లోపల అర్హులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ పి కనకారావు, మండల తాసిల్దార్ జయ, ఇతర రెవిన్యూఅధికారులు ,సిబ్బందిహాజరయ్యారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా