మావోయిస్టు కార్యకలాపాలకు కరోనా ఎఫెక్ట్
- Get link
- X
- Other Apps
(పీవీ సత్యనారాయణ రావు- జనహృదయo ప్రత్యేక ప్రతినిధి)
* 2020 లో తగ్గిన ప్రభావం
* వర్గ శత్రువులు నడుమ తగ్గిన ఉద్రిక్తత.
నర్సీపట్నం: 2020 సంవత్సరం ప్రపంచ ప్రజల జీవనశైలిని మార్చేసింది..
సామాన్య ప్రజలు మొదలు మిలియనీర్లు..బిలియనీర్లు సైతం కరోనా మహమ్మారి ప్రభావానికి విలవిల లాడుతున్నారు..
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ చిన్నా భిన్నమైంది..ఈ ప్రభావానికి సీపీఐ మావోయిస్టులు సైతం అతీతం కాలేదు.
లాక్ డౌన్ ముందు…లాక్ డౌన్ తర్వాతగా విభజించుకుంటే ఆంధ్రా-
ఒడిస్సా సరిహద్దు (ఏఓబీ) జోన్ ఈస్ట్ డివిజన్ పరిధిలోని మావోల ప్రభావం
తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.గత కోద్ది సంవత్సరాల నుండి వరుస ఎన్
కౌంటర్లు, అరెస్టులు, లోంగుబాట్లు కారణంగా కేడర్ పరంగా బలహీన పడిన
మావోయిస్టు పార్టీ మనుగడ అంతంత మాత్రం గానే ఉంది.
కరోనా కష్టకాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా
మావోయిస్టు పార్టీ ఆదీవాసీల సంక్షేమం కోసం అంటూ స్వచ్చంధ కాల్పులు విరమణ
ప్రతిపాదించింది.అయితే మావోయిస్టుల ప్రతిపాదనను పట్టించుకోకుండా పోలీసులు
ఒకవైపు గిరిజన గ్రామాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో ఆరోగ్య
అవగాహన కార్యక్రమాలు, వైద్యశిబిరాలు నిర్వహిస్తూనే, మరోక వైపు కూంబింగ్,
ఏరియా డామినేషన్,తణికీలు వంటివి చేపడుతూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అదే రీతిలో మావోయిస్టులు కూడా ఒకవైపు స్వచ్చంధ కాల్పులు
విరమణ ప్రకటించినా, మరోక వైపు అమర వీరుల వారోత్సవాల్లో
(జూలై28-ఆగస్ట్3…2020) భాగంగా కూంబింగ్ జరిపే పోలీసు బృందాలు,
మాజీలను టార్గెట్ చేస్తూ పెదబయలు మండలం చింతల వీధి అటవీ ప్రాంతంలో అమర్చిన
మందుపాతరలు ఇద్దరు అమాయక ఆదీవాసీలను బలితీసుకున్నాయి.
దాంతో ఈ దుర్ఘటన ను తమకు అనుకూలంగా మార్చుకుని వర్గ
శత్రువులైన పోలీసులు చేపట్టిన ప్రచారం మావోయిస్టులపై ఆదీవాసీల్లో కోంత
వ్యతిరేకత పెంచింది.దాంతో ఆత్మరక్షణలో పడిన మావోయిస్టులు చనిపోయిన ఆదీవాసీ
కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సివచ్చింది
వారోత్సవాల ప్రభావం పాక్షికం..
2020 సంవత్సరం లో మావోయిస్టులు నిర్వహించిన మూడు
వారోత్సవాల ప్రభావం అంతంత మాత్రం గానే ఉంది.తోలుత జూలై 28 నుండీ ఆగస్టు 3
వరకూ అమర వీరుల వారోత్సవాలు, ఆ తర్వాత సెప్టెంబరు 21 నుండీ 27 వరకూ
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు, చివరగా డిసెంబర్ 2 నుండీ 9 వరకూ
పీఎల్జీఎ వారోత్సవాలను నిర్వహించారు.కాగా ఈ మూడు వారోత్సవాలు సమయంలో పార్టీ
పరంగా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగక పోవటంతో పోలీసులు కోంత ఊపిరి
పీల్చుకున్నారు.
అయితే మావోయిస్టులు తమ ఉనికిని నిరూపించుకునేందుకు
పిఎల్జీఏ వారోత్సవాలు తర్వాత పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆదీవాసీ
గిరిజనులను పోలీసు ఇన్ ఫార్మర్లుగా ముద్రవేసి పీఎల్జీఎ కేడర్ ద్వారానే
హతమార్చారు.
సంస్ధాగతంగా బలహీనం
—————————— —-
కరోనా సంవత్సరం లో మావోయిస్టులు కేడర్ రిక్రూట్మెంట్
జరపలేక సంస్ధాగతంగా మరింత బలహీనపడ్డారు.తమ పోరపాటు కారణంగానే ఇద్దరు
ఆదీవాసీలు మృతి చెందటం,కరోనా దృష్ట్యా గిరిజన సంక్షేమం అంటూ కాల్పులు విరమణ
ప్రకటించి, ఇద్దరు ఆదివాసీ గిరిజనులను పోలీసు ఇన్ ఫార్మర్లుగా ముద్ర వేసి
హతమార్చటం వంటి సంఘటనలు ఆదీవాసీల్లో అన్నల పట్ల ఆదరణ మరింత తగ్గేందుకు
కారణమైనవని ప్రభుత్వ ఇంటిలిజెన్స్ వర్గాల అంచనాగా చెప్పవచ్చును.
పోలీసుల ఆధిపత్యం
—————————–
ఏవోబీ పరిధిలో ఏడాది కాలంలో మూడు ఎదురు కాల్పుల ఘటనలు
జరిగాయి.విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి
దయ, ఛత్తీస్గఢ్ కు చెందిన కిషోర్ పోలీసు ఎన్ కౌంటర్లు లో మృతిచెందారు.
మృతులిద్దరూ ఎసీఎమ్ కేడర్ కు చెందిన వారు కావటంతో అసలే కేడర్ కోరతను
ఎదుర్కోంటున్న మావోయిస్టు పార్టీకి కరోనా సంవత్సరం మరింత నష్టాన్ని
కలిగించింది
అంతే కాకుండా మరికోంత మంది దళ సభ్యులను అరెస్టు
చేయటం, పలువురు మిలీషియా సభ్యులను సరెండర్ చూపటం ద్వారా మావోలపై పోలీసులు
కోంత ఆధిక్యత సాధించ గలిగారు.
దాంతో కరోనా సంవత్సరమైన 2020 లో మావోయిస్టులు కోంత గడ్డు పరిస్ధితులనే ఎదుర్కొంటున్నా రని చెప్పవచ్చును.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment