మధ్యాహ్న భోజన పధకం అమలుపై ..... త్వరలో “కాగ్” తణికీలు

       


      (పీవీ సత్యనారాయణ రావు)

 * ఈనెల 7వ తేదీ నుంచి క్షేత్ర స్ధాయిలో పరిశీలనకు ప్రత్యేక బృందాలు రాక

* రికార్డుల అప్ డేట్ కు విద్యాశాఖ లో ఉరుకులు…పరుగులు.

నర్సీపట్నం:  రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్ధల్లో చదువుతున్న విద్యార్థులకు కరోనా కాలంలో జరిపిన డ్రై రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగినట్లుగా అందిన ఫిర్యాదులపై ” కాగ్ ” క్షేత్ర స్ధాయి తణికీలకు సన్నద్ధమవుతోంది.
ప్రభుత్వ పధకాల అమల్లో లోటుపాట్లను క్షుణ్ణంగా పరిశీలించి, అవకతవకలు, నిధులు దుర్వినియోగం వంటి అంశాలను వెలికి తీసే కంప్టోట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) ప్రత్యేక బృందాలు ఈనెల 7వ తేదీ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కు సంబంధించిన జిల్లా, మండల కార్యాలయాల్లో నూ, క్షేత్రస్ధాయి లో ప్రభుత్వ పాఠశాలల్లోనూ తణికీలు జరపనున్నాయి.

మధ్యాహ్న భోజన అమలుపై పరిశీలన….

ఈ ఏడాది మార్చి19 వ తేదీ నుండి అక్టోబరు 31 వ తేదీ వరకూ ప్రభుత్వ విద్యా సంస్ధల్లో మధ్యాహ్న భోజన పధకం అమల్లో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డ్రై రేషన్ పంపిణీ ఏవిధంగా జరిగిందనే అంశాన్ని కాగ్ ప్రత్యేక ఆడిట్ బృందాలు క్షుణ్ణంగా తణికీ చేయనున్నాయి.ఇందుకు సంబంధించిన అన్నీ రికార్డులను కాగ్ బృందాలను పరిశీలించ నుండటంతో విద్యాశాఖ లో అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
పాఠశాలల్లో ఇందుకు సంబంధించిన పది రకాల రికార్డులను అప్ డేట్ చేసే పనిలో విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు తలమునకలై ఉన్నారు.ఈ అంశాలను వివరించి తగు జాగ్రత్తలు తీసుకునే విషయమై ఇప్పటికే బుధ, గురువారాల్లో విద్యాశాఖాధికారులు వివిధ స్ధాయిల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా