రెవెన్యూ సిబ్బంది అవకతవకలపై అధికారుల నిర్లిప్తత
(పీవీ.సత్యనారాయణ రావు) * నిందితుల సహకారంతోనే తప్పించుకుంటున్న బాధ్యులు * రాజకీయ ఒత్తిళ్లతో ఫిర్యాదులు బుట్టదాఖలు * స్పందన దరఖాస్తులపై చర్యలు శూన్యం నర్సీపట్నం: ప్రభుత్వంలోని మిగతా శాఖలపై పెత్తనం చెలాయించే రెవెన్యూ శాఖలోనే అవినీతి అవకతవకలు జోరుగా సాగుతున్నాయి. దిగువ స్థాయి రెవెన్యూ ఉద్యోగుల అవకతవకలపై నిర్దిష్ట ఫిర్యాదులు అందుతున్నా, పత్రికల్లో వార్తా కథనాలు వెలువడుతున్నా సంబంధిత అధికారులు తమకేందుకులే అనే ధోరణితో నిర్లిప్త వైఖరిని అవలంబిస్తున్నారు. స్పందన ఫిర్యాదులపై చర్యలు శూన్యం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో మండల, డివిజన్ ,జిల్లా స్థాయిల్లో ప్రజలు అందజేస్తున్న ఫిర్యాదులు విజ్ఞప్తులలో అత్యధిక శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నవి. అధికారులు మారినప్పుడల్లా బాధిత ప్రజలు మరొకసారి వచ్చి అందజేస్తున్న ఫిర్యాదుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది.అంతేకాకుండా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం రెవెన్యూ శాఖకు చెందిన వారే ఉంటున్నారు .అదేవిధంగా దిగువ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది రాజకీయ అండదండలతో జరుపుతున్న అవకతవకలకు సంబంధించి పత్రికల్లో కథనాలు...