60లక్షల విలువైన గంజాయి పట్టివేత


ఎస్ కోట: లా శృంగవరపు కోట మండలం ముషిడిపల్లి కూడలి వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో 1500కేజీల గంజాయిని పట్టుకున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం శృంగవరపుకోట పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వెల్లడించారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తుండగా గోనెసంచి లోడుతో వస్తున్న ఓ లారీ, వ్యానును ఆపి తనిఖీ చేయగా గోనెసంచుల మధ్యలో 50బస్తాల గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60లక్షల వరకు ఉంటుందని ఆమె వివరించారు. గంజాయితోపాటు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్‌ మండలం పరిసరాల నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు నీలకంఠం, రాజేశ్‌ పాల్గొన్నారు. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా