మత్యకారుల జీవితంలో వెలుగులు నింపాలన్నదే సిఎం లక్ష్యం
పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి. అప్పలరాజు ...
నరసాపురం : రాష్ట్ర తీరప్రాంతాన్ని అభివృద్ది చేసి మత్స్య కారులు కుటుంబాల్లో వెలుగులు ,యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని రాష్ట్ర పశుసంవర్ధక,పాడిపరిశ్రమ,మత్స్య శాఖ మంత్రి సీదిరి.అప్పల రాజు అన్నారు. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో రూ 18.58 కోట్ల తో 18 ఏక రాలను, వేములదీవి ఈస్ట్ లో 300 ఏకరాలు రూ 500 కోట్ల తో ఏర్పాటు చేస్తున్న "ఆక్వా యూనివర్సిటీ" స్థలాలు పరిశీలన,జిల్లా కలెక్టర్ రేవు.ముత్యాల రాజు, శాసన సభ్యులు ముదునూరి.ప్రసాద్ రాజు తో కలసి శనివారం మంత్రి పరిశీలన చేశారు. ఇందుకు సంబంధించిన మ్యాప్ లను కూడ వారు ఇరువురు పరిశీలించారు. అనంతరం ఆక్వా రైతులతో ముఖా ముఖిలో మంత్రి శ్రీ అప్పల రాజు , రేవు.ముత్యాల రాజు, శాసన సభ్యులు ముదునూరి. ప్రసాదు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్ లు ,3 చోట్ల పోర్టులు,3 చోట్ల ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు ఏర్పాటు కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
బెంగుళూరు చెందిన సెఫర్ పిపుల్ టెక్నికల్ బృందాన్ని పంపించి తీర ప్రాంతానికి పంపించి వారు పరిశీలన చేసి డి.పి.ఆర్ నివేదిక అందజేస్తారని ,శంఖుస్థాపనకు శ్రీకారం చుట్టనున్నామని మంత్రి తెలిపారు. దశబ్దాల చిరకాల స్వప్నం, ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేసి వారితో ప్రారంభించి , తీర ప్రాంతానికి భాహుమతిగా ఇస్తామని మంత్రి తెలిపారు. దేశంలో ఆక్వా యూనివర్సిటీలు ఐదే ఉన్నాయి అని ముఖ్యమంత్రి కోరిన వెంటనే స్పందించి ప్రధాన మంత్రి తో ఆక్వా యూనివర్సిటీనీ మంజూరు చేశారని దీని బట్టి కేంద్రంలో మన ముఖ్యమంత్రి పాత్ర ఎంత ఉందో అర్థం అవుతుంది అన్నారు.దేశం లో చేప మరియు రొయ్య ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానం లో ఉన్నదని అందులో 71 శాతం ఉత్పత్తులు మనవేనని సమిస్ట కృషితో ఆక్వారంగం ముందుకు సాగిందని ఆయనన్నారు. 14 రోజుల లోపుగా ఫిష్ టాంక్ లకు అన్ని అనుమతి ఇస్తామని,ఎవ్వరూ ఆందోళన చెందవలసిన పని లేదని, ఆక్వా రైతులకు రూ 750 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇచ్చామని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు.
జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు మాట్లాడుతూ, ఆక్వా యూనివర్సిటీ వలన ఎంతో యువతీ యువకులకు మంచి విద్య తో పాటు మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వలన మత్స్యకారుల వలసలు ఉండవని వారి జీవితాలలో వెలుగులు లభిస్తాయని మర్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం వలన కొత్త కొత్త వంగడాలు తయారు చేయడంతో పాటు విద్యార్థులకు మంచి విద్య తో మంచి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు అన్నారు.
శాసన సభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ ,ఆక్వా యూనివర్సిటీ ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది అని ఆయన అన్నారు. జిల్లా లో ఏకైక తీర ప్రాంతం మన నరసాపురం లో వశిష్ట వారధి,ఫిషింగ్ హార్బర్,ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి తో ప్రారంభోత్సవం చేసి చిరకాలపు స్వప్నాన్ని నిజం చేస్తామని శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు.ముత్యాల రాజు, శాసన సభ్యులు ముదునూరి.ప్రసాదు రాజు, రాజోలు శాసన సభ్యులు రాపాక.వర ప్రసాదు,సబ్ కలెక్టర్ కె. యస్. విశ్వనాథన్, మత్స్య శాఖ కమిషనర్ కె కన్నబాబు,డి.సి.సి.బి.చైర్మన్ కవురు.శ్రీనివాస్,ఫిషరీస్ జె.డి.శ్రీ జి.రాధా కృష్ణ,డి.డి.శ్రీ వి.తిరుపతయ్య, వేట నరీ జె.డి.శ్రీ పి. శ్రీనివాస రావు,డి.డి. యస్.టి.జి.సత్య గోవింద, ఏ.యం.సి చైర్మన్ దొండపాటి.స్వాములు ,నాయకులు పి.డి.రాజు, షేక్.బులి మస్తాన్ , బర్రి.శంకర్, కామన.బుజ్జి, కొత్తపల్లి.భుజంగ రాయుడు (నాని),శ్రీ దొంగ.మురళి , బర్రి.జయ రాజు, యర్రంశెట్టి .బాబులు తది తర వివిధ శాఖలు అధికారులు, తది తర నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment