దానిమ్మను ఆడవాళ్లు ఇలా దానిమ్మను ఆడవాళ్లు ఇలా ఉపయోగించుకోవచ్చు తెలుసా... !!
ఆడవారు అందాన్ని తరించే వాటిలో మొటిమలు సమస్య ఒకటి. మొటిమల వల్ల ఆడవారు ముఖం కాంతి హీనంగా మారుతుంది. హార్మోన్స్ మధ్య సమతుల్యత లోపించడం వలన మొటిమల సమస్యలు వస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే ఎన్నెన్నో క్రీములు వాడుతుంటారు. కానీ ఫలితం మాత్రం అప్పటికప్పుడే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకు యధా విధిగా మొటిమలు వస్తాయి. అందుకే ఇంట్లో దొరికే దానిమ్మ పండు ఉపయోగించి మొటిమలు ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసం మొటిమలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వలన ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానిమ్మలో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువ కాబట్టి ఇది మొటిమలు త్వరగా పెరగకుండా అడ్డుకోగలదు. ముందుగా ముఖాన్ని క్లీన్ చేసుకుని దానిమ్మ గుజ్జు, నిమ్మరసాన్ని కలిపి సబ్ లాగా తయారు చేసుకుని ముఖానికి అపి చేసి 15 నిముషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. దానిమ్మ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. పావు కప్పు దానిమ్మ రసం రోజూ తాగితే దీనిలో ఉండే విటమిన్-ఎ, సి, ఇ, బి-లు కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి యవ్వనంగా ఉండేలా చేస్తాయి. నిమ్ములో ఉండే నూనెలు కణాలకు శక్తిని అందించి, వయసు మీరిన కొలది చర్మంపై కలిగే ముడతలను ఆలస్యంగా కలుగజేస్తాయి. వృద్ధాప్యాన్ని అపే ఆహార పదార్థాలలో ఇది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అంతేకాదు మొటిమల కారణంగా ఏర్పడే మచ్చలను తగ్గించుటకు దానిమ్మ గింజల నుంచి తయారు చేసిన నూనెలను వాడమని సౌందర్య నిపుణులు సలహా జస్తున్నారు. దానిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే అది మంచి టోనర్గా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు తగ్గిస్తుంది. సూర్యకిరణాలకు బహిర్గతం అవటం వలన కలిగే ముదతలను దానిమ్మ పండు తగ్గించి వేస్తుంది. వయసు మీరిన కొలది కలిగే మచ్చలను ఈ పండు తినటం ద్వారా తగ్గించుకోవచ్చు
Comments
Post a Comment