చింతపల్లిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచండి

చింతపల్లి :  చింతపల్లి మండల కేంద్రంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఎం పార్టీ నాయకులు, వర్తక సంఘం సభ్యులు చింతపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగు నీరు బయటకు పోయే మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.


ఎట్టకేలకు గత సంవత్సర కాలంలో రహదారికి ఇరువైపులా డ్రైనేజి ఏర్పాటు చేసినప్పటికీ నీరు పోయే మార్గం లేక డ్రైనేజ్ లోనే నీరు నీరు నిల్వ ఉండిపోతుందన్నారు. దుకాణాల ముందు ఉన్న డ్రైనేజీలో మురుగు నీరు ఉండడం వలన దుకాణదారులు దోమల బారిన పడి మలేరియా, డెంగు, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నా రన్నారు. గతంలో డ్రైనేజీని ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ నీరు బయటకు పోయే మార్గం ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కాంట్రాక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకొని మురుగు నీరు బయటకు పోయే మార్గాన్ని చూపాలని డిమాండ్ చేశారు.


అనంతరం ఎంపీడీవో ఉషశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్, మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్, సాగిన చిరంజీవి, వర్తక సంఘం ప్రతినిధులు బొడ్డేటి జోగేశ్వరరావు, తాటిపాకల రమేష్, వసపరి శ్రీను, స్రవంతి, శెట్టి రమేష్, తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా