విశాఖలో టిడిపికి షాక్...


వైసిపి వైపు ముగ్గుచూపుతున్న సిటీ ఎమ్మెల్యే వాసుపల్లి...


విశాఖపట్నం (జనహృదయం) : విశాఖ సిటీకి  చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార వైసిపి వైపు మొగ్గు చూపకాడంతో  తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే విశాఖ దక్షిణ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరపున గెలిచిన వాసుపల్లి గణేష్ శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఏర్పాటు చేసుకున్నారు.  కాగా గత కొన్ని రోజులుగా వసుపల్లి  టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వైసీపీలో చేరుతున్నారనే వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాసుపల్లికి సర్ధి చెప్పేందుకు మాజీ మంత్రి, జిల్లా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సమాచారం. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోనప్పటికీ వాసుపల్లి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు  స్పతమైన సంకీతాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే వైసీపీ చెంతకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, గిరి, కరణం బలరాం, ఏపీలో జనసేన పార్టీ నుండి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేతో పాటు విశాఖ నుండి వసుపల్లి గణేష్ కూడా ఆ జాబితాలోకి చేరనున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా