భారత్ లో 51.18 లక్షలకు చేరిన కరోనా కేసుల సంఖ్య…


దేశంలో 97.89 వేల కరోనా పోజిటివ్ కేసులు….


ఒక్కరోజు వ్యవధిలో రికార్డ్ స్తాయిలో…


న్యుడిల్లీ (జనహృదయం): దేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,36,613 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 97,894 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.   ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 97.8 వేల కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి  కాగా,  సెప్టెంబర్‌ 12వ తేదీన 97వేల కేసులు నమోదయ్యాయి.  దీంతో గురువారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,253కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.  వీరిలో ఇప్పటికే 40లక్షల మంది కోలుకాగా బుధవారం ఒక్కరోజే 82వేల మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది.


ప్రస్తుతం దేశంలో మరో 10 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా మరో 1132మంది కరోనా రోగులు చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 83,198కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.64శాతానికి చేరగా మరణాల రేటు  1.63శాతంగా ఉండదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా