మత్యకారుల జీవితంలో వెలుగులు నింపాలన్నదే సిఎం లక్ష్యం
పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి. అప్పలరాజు ... నరసాపురం : రాష్ట్ర తీరప్రాంతాన్ని అభివృద్ది చేసి మత్స్య కారులు కుటుంబాల్లో వెలుగులు ,యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని రాష్ట్ర పశుసంవర్ధక,పాడిపరిశ్రమ,మత్స్య శాఖ మంత్రి సీదిరి.అప్పల రాజు అన్నారు. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో రూ 18.58 కోట్ల తో 18 ఏక రాలను, వేములదీవి ఈస్ట్ లో 300 ఏకరాలు రూ 500 కోట్ల తో ఏర్పాటు చేస్తున్న "ఆక్వా యూనివర్సిటీ" స్థలాలు పరిశీలన,జిల్లా కలెక్టర్ రేవు.ముత్యాల రాజు, శాసన సభ్యులు ముదునూరి.ప్రసాద్ రాజు తో కలసి శనివారం మంత్రి పరిశీలన చేశారు. ఇందుకు సంబంధించిన మ్యాప్ లను కూడ వారు ఇరువురు పరిశీలించారు. అనంతరం ఆక్వా రైతులతో ముఖా ముఖిలో మంత్రి శ్రీ అప్పల రాజు , రేవు.ముత్యాల రాజు, శాసన సభ్యులు ముదునూరి. ప్రసాదు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్ లు ,3 చోట్ల పోర్టులు,3 చోట్ల ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు ఏర్పాటు కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బెంగుళూరు చెందిన సెఫర్ పిపుల...