ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉంది : వైద్యులు
చెన్నై (జనహృదయం): ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్‌ను చెన్నై ఎంజీఎం వైద్యులు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని చైన్నై ఎంజీఎం వైద్యులు ప్రకటించారు. ఐసీయూలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీదే చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నామని వైద్యులు తెలిపారు.
కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉన్నట్లుండి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని వైద్యులు ప్రకటించారు. వెంటనే ఐసీయూకి తరలించి వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, సామాన్యులు అందరూ ట్వీట్లు చేశారు.
Comments
Post a Comment