రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇకపై వీడియో రికార్డింగ్

అమరావతి (జనహృదయం): ఏపి‌లో స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఇకపై వీడియో రికార్డింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రయోగాత్మక‌ ప్రాజెక్టుగా 20 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్‌ ప్రక్రియను చేపట్టనుంది. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. ఈ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయిలోని కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా