ఎపిలో కొత్తగా 9927 పోజిటివ్ కేసులు…
అమరావతి (జనహృదయం): ఎపిలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 64,351 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 33,56,852కి చేరింది. దీంతో మంగళవారం కొత్తగా 9927 కరోనా పాజిటివ్‌కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్ బారినపడి 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3460కి చేరింది. మరోవైపు వైరస్ నుంచి కోలుకుని పెద్ద సంఖ్యలో బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. తాజాగా 9,419 మంది డిశ్చార్ అవ్వగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 275352కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Comments
Post a Comment