టెక్నాలజీ వాడుకలో ఈ ఏడాది 36 అవార్డుల సాధించిన ఏపి పోలీసు శాఖ....
అమరావతి (జనహృదయం): ఎపిలో పోలీసు శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వాడుకొంటున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పరంపర కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్‌శాఖ పది అవార్డులను కైవసం చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 26 అవార్డులను సాధించగా, తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను దక్కించుకొంది. దీంతో ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను గెలుచుకొని ఎపి పోలీస్ శాఖ సత్తా చాటింది. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి డీజీపీ గౌతం సవాంగ్ వెబినార్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే ఇటువంటి ఘనత సాధించగలిగామని, సత్ఫలితాలు వస్తున్నాయని డిజిపి పేర్కొన్నారు..
Comments
Post a Comment