భారత్ లో 32 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు చేరింది. వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి భారత్ లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్ కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వెరస్ నిరారణ పరీక్షలు చేశామని భారత్ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఏపీ: 24 గంటల్లో 8,473 మంది డిశ్చార్జ్ అమరావతి : గత 24 గంటల్లో 61,838 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,830 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,473 మంది డిశ్చార్జ్ అవ్వగా, మొత్తం 2,86, 720 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 81 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 34, 18, 690 మందికి కరోనా పరీక్షలు చేశారు. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా