దేశంలో 25లక్షలు దాటిన కరోనా కేసులు…
న్యూ ఢిల్లీ, (జనహృదయం): భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 65,002 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 996మంది కరోనా పాజిటివ్తో మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 25 లక్షల 26 వేల192 కి చేరింది. కాగా వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 6,68,220 మంది కరోనా బాదితులకు చికిత్స కొనసాగుతున్న అందిస్తున్నారు. కరోనా మహమ్మారి నుండి కోలుకుని 18 లక్షల 08 వేల 936 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 49,036 మంది మృతి చెందారు.
Comments
Post a Comment