ఏజెన్సీ బంద్ సంపూర్ణం


చింతపల్లి (జనహృదయం) జూన్ 17: జీవో నెంబర్ 3 రద్దు కు వ్యతిరేకంగా చేపట్టిన మన్యం రెండు రోజుల బందు తొలిరోజు సంపూర్ణంగా ముగిసింది. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల్లో ఈ బంద్ విజయవంతమైంది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి బ్యాంకులు మూతపడ్డాయి కనీసం ప్రైవేటు వాహనాలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎక్కడికక్కడ రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి  వేసి రాకపోకలను స్తంభింపజేశారు అలాగే దుకాణాలన్నీ మూసి వేయాల్సిందిగా ముందుగా ప్రచారం చేశారు. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ లావాదేవీలను బుధవారం జరగనున్న వారపు సంతలు రద్దయ్యాయి జీవో నెంబర్ 3 కొనసాగింపుపై ప్రభుత్వం సుప్రీంకోరులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని కోరారు చింతపల్లి, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బంద్ లో  పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. కాగా చింతపల్లిలో జేఏసీ నాయకులు మొట్టడం రాజుబాబు, ఉగ్రంగి గిరి, లోచల రామకృష్ణ రమణ, చంద్రకళ, సిపిఎం నాయుకుడు బోనంగి చిన్నయ్యపడాల్, తెలుగు దేశం నాయకులు కోటేశ్వర రావు తదితర జేఏసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా