గిరిజనులకు అన్యాయం జరగనివ్వం

 


అమరావతి: గిరిజన ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని టీచర్ పోస్టులను 100 శాతం గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఏపీలో జారీ అయిన జీవో నంబర్ 3ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోరులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వారు సీఎంను కోరారు. జీవో నంబర్ 3ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చినట్టు ఎం వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించి వారి సలహాలు తీసుకునేందుకు గురువారం గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్) సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశారు. సీఎంను కలిసిన వారిలో తెల్లం - బాలరాజు, పీడిక రాజన్న దొర, కె.కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి తదితరులున్నారు. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా