వలస కార్మికులకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
కాలినడకన ఏపీకి చేరిన వలస కార్మికులకు ఊహకందని సాయం అందిస్తున్న సీఎం జగన్
అమరావతి (జనహృదయం- ప్రతినిధి రాజన్): లాక్ డౌన్ తో చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు ఒరిస్సాకు చెందిన 450 మంది వలస కార్మికులకు సకల సౌకర్యాలతో మూడు రోజులపాటు అన్ని వసతులను సమకూర్చి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఒరిస్సా కు తరలిస్తున్నారు పెద్దలకు పిల్లలకు మార్గమధ్యలో అవసరమయ్యే తినుబండారాలతో పాటు భోజన ప్యాకెట్లు అందించే ప్రయాణానికి బస్సులను సిద్ధం చేశారు ఏపీ నుండి ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు చేరే వరకు పూర్తిస్థాయిలో వలస కూలీలకు మార్గమధ్యలో ఉదయం రాత్రి భోజనాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏపీ అధికారులు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇటీవల ఒడిషా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కార్మికులు ఏపీలో చిక్కుకు పోయారని వారిని తరలించే ఏర్పాట్లు చేయాలని చేసిన విజ్ఞప్తి మేరకు జగన్మోహన్ రెడ్డి స్పందించి మహారాష్ట్ర వలస కార్మికులు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు దీనిలో భాగంగా 450 మందిని ఆదివారం ఒరిస్సా రాష్ట్రానికి తరలించేందుకు బస్సులను సిద్ధం చేసి పంపిస్తున్నారుు
కొనసాగుతున్న వందలాది వలస కార్మికుల తరలింపు
ఇప్పటివరకు కృష్ణా జిల్లా నుంచి 16 బస్సుల్లో 410 మందిని శ్రీకాకుళం నుంచి ఒక బస్సులో 22 మందిని ప్రకాశం జిల్లా నుంచి బస్సులో 470 మందిని కృష్ణా జిల్లా నుండి 52 మంది వలస కార్మికులను పంపిస్తున్నామని అధికారులు తెలిపారు నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదని వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని కూలీలకు వివరిస్తున్నారు
సీఎం జగన్ ఆదేశాలతో వలస కూలీల అందుతున్న ఊహించని సహాయం
మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం మాదిరిగా వలస కూలీలకు అన్ని వసతులు కల్పించి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి ఆదుకున్న పరిస్థితులు లేవని అధికార యంత్రాంగం పేర్కొంది అంతేకాకుండా వలస కార్మికులకు ఎక్కడా ఎటువంటి లోటు జరగకుండా ఖర్చుల గురించి వెనకాడకుండా చర్యలు తీసుకోవాలని మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం మేరీ వలస కూలీల కోసం మెరుగైన సేవలు అందిస్తోంది.
Comments
Post a Comment