నర్సీపట్నం లో రెడ్ జొన్ ఎత్తివేతకు సిద్దం...
నర్సీపట్నం మే 16 (జనహృదయం) : నర్సీపట్నంలో రెడ్ జోన్ ఎత్తవేసేందుకు సన్నాహాలు చేసినట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రకటించారు. నర్సీపట్నం మున్సిపల్ సమావేశ మందిరంలో విలేకరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రెడ్ జోన్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుండడంతో 18వ తేదీనుండి నర్సీపట్నాన్ని ఆరెంజ్ జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో, డిఎం అండ్ హెచ్ఓతో మాట్లాడినట్లు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆదివారం సాయంత్రానికి అధికారికంగా డీ-నోటిఫికేషన్ రావాల్సిఉందని , దానికంటే ముందుగా పత్రికా ముఖంగా ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేసామని తెలిపారు. నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసులు మన ప్రాంతానికి చెందినవి కాకపోయినా మున్సిపాలిటీ లోని మూడవ వార్డు ప్రజలు, ప్రభుత్వ సూచనలు మేరకు ఎంతో సంయమనం పాటించారని , ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కరోనా నివారణలో ఓపికతో ఉన్నారని వారందరికీ పత్రికా ముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి , తహశీల్దార్ శ్రీనివాసరావు, పట్టణ సి ఐ స్వామినాయుడు మాట్లాడుతూ కరోనా నివారణకు ఓపికతో ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Post a Comment