బాధిత గ్రామాల్లో బస చేసి భరోసా కల్పించండి: సీఎం జగన్

 


విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన, ప్రస్తుత పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష…


సహాయకచర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులుకు కీలక ఆదేశాలు…


మరో మూడు రోజుల్లో మిగిలిన బాధితులకు ఆర్థికసహాయం…


ప్రభావిత గ్రామాల ప్రజల వైద్యంకోసం క్లినిక్‌…


రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు…


ప్రమాదకర పరిశ్రమల తరలింపుపైనా ఆలోచనలు…


అన్ని కమిటీల నివేదకలూ పరిగణలోనికి తీసుకోవాలని ఆదేశించిన సీఎం…  


ట్యాంకుల్లో స్టెరిన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం
తిరిగి కొరియాకు 13వేల టన్నుల స్టెరెన్‌…


అమరావతి  (జనహృదయం): విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన అనంతరం పరిణామాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్‌ లీక్‌ ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి మంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సీఎం ఆదేశించిన విధంగా మరణించిన కుటుంబాల్లో లీగల్‌ హెయిర్‌ ఫైనల్‌ అయిన 8 మందిలో 5 గురికి పరిహారం అందించామని తెలిపారు. మిగిలి వారు నగరానికి దూరంగా ఉన్నందున వారికి కూడా అందిస్తామని మంత్రులు మంత్రులు బదులిచ్చారు.


గ్యాస్ లీక్ గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం 4 గంటలకల్లా ఇవి ముగుస్తాయని,  సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నామని ముఖ్యమంత్రికి  మంత్రులు తెలిపారు.  బాధితులు చాలామంది ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని, ఎక్స్‌టర్నల్‌ శానిటేషన్, ఇంటర్నెల్‌ శానిటేషన్‌పై నిపుణులు స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ఇచ్చారని, దాని ప్రకారమే శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నివేదించారు.


మంత్రులంతా బాధితులకు చెందిన ఐదు గ్రామాల్లో ఈ రాత్రికి బసచేయాలని సీఎం ఆదేశించారు. అలాగే శానిటేషన్‌ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని, గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10వేలు చెల్లించాలని ఆదేశించారు.


పిల్లలైనా, పెద్దలైనా.. అందరికీ పదివేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశాలు. అందర్నీ లెక్కలోకి తీసుకోవాలని ఇచ్చే డబ్బు పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి.. ఇబ్బందుల్లేకుండా ఆ ఇంటి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఈ డబ్బు బ్యాంకులు జమచేసుకోలేని విధంగా అన్‌ ఇంకబర్డ్‌ ఖాతాల్లో వేయాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.  మరో మూడురోజుల్లో మిగతావారికీ ఆర్థిక సహాయం అందజేయాలని సీఎం ఆదేశించారు.


మంగళవారం వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించి,  అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో డబ్బు వేసేలా బ్యాంకర్లతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా, ఫిర్యాదులు లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు కొనసాగాలన్న సీఎం సూచించారు.  ఆర్థిక సహాయం పొందేవారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరిపేరైనా కనిపించకపోతే వారు ఎలా పేరు నమోదుచేసుకోవాలో వారి వివరాలను అందులో ఉంచాలని సీఎం పేర్కొన్నారు. గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం మూడు రోజుల్లో పూర్తి చేసి  డబ్బు ఖాతాల్లో జమచేసిన తర్వాత వాలంటీర్ల ద్వారా వారికి స్లిప్‌ అందించి వారినుంచి రశీదు తీసుకోవాలన్నారు. అలాగే ఆస్పత్రిపాలైన వారికీ కూడా వీలైనంత ఆర్థిక సహాయం అందించాలని, గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్యపరమైన సేవలకోసం క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు.


ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి చెందిన వైద్యుల బృందాన్ని ఈ ప్రాంతంలోని వారికి వైద్య సేవలను అందించడానికి నియమిస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. కాగా గ్యాస్‌ దుర్ఘటన సమయంలో బాధితులను ఆదుకోవడానికి, వారి ప్రాణాలను రక్షించడానికి అధికారులు, పోలీసులు చాలా చక్కగా పనిచేశారని సీఎం ప్రశంసించారు.


ఈ సమీక్షలో డిప్యూటీసీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటుగా విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  మంత్రులు కన్నబాబు, బొత్స సత్యన్నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాస్, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా