డా.సుధాకర్ కేసు సీబీఐ కి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశం...

సుధాకర్ పై చేయిచేసుకున్న పోలీసులపై కేసునమోదుచేసి విచారణ చేపట్టాలని ఆదేశించిన న్యాయస్థానం
అమరావతి : విశాఖలో వైద్యాధికారి సుధాకర్ పై దాడి ఘటనలో కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని హైకోర్ట్ ఆదేశించింది. డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టు వ్యవహారంపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. డాక్టర్‌ సుధాకర్‌పై దాడి చేసిన పోలీసుల‌పై కేసు నమోదు చేసి సీబీఐతో  విచారణ చేపట్టాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్‌ సుధాకర్‌ శరరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్‌ ఇచ్చిన నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్‌ సుధాకర్‌ గాయాల‌ గురించి పేర్కొనలేదని కోర్టు పేర్కొంది.. వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ గతంలో వ్యాఖ్యానించి సస్పెండైన మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసు అరెస్టు చేయడం కల‌కలం సృష్టించింది. సుదాకర్‌ గొడవ చేస్తున్నట్లు స్థానికులు 100కు ఫోన్‌చేయడంతో పోలీసు అక్కడికి వెళ్లారు. పోలీసుల‌ను, ముఖ్యమంత్రిని డాక్టర్‌ సుధాకర్‌ దుర్భాషలాడటంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసు తెలిపారు. విధుల‌కు ఆటంకం కల్గించినందుకు వైద్యుడిపై 353,427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డాక్టర్‌ సుధాకర్‌పై చేయి చేసుకున్నారు. ఆయన్ను కొట్టిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ను పోలీస్ అధికారులు సస్పెండ్‌ చేసినట్లు వెళ్లదించారు.  డాక్టర్‌ సుధాకర్‌ చేతులు వెనక్కి కట్టివేయడం, ఆయనను అర్ధనగ్నంగా చేయడం, రోడ్డుపై పొర్లించడం వంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. డాక్టర్ల సంఘాలు, దళిత సంఘాలు దీనిపై తీవ్రస్థాయి స్పందించాయి, ప్రతిపక్ష పార్టీలు డాక్టర్‌ సుధాకర్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు, నిరసనను వ్యక్తం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై తమకు న్యాయం చేయాలంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించి ఎనిమిదివారాల గడువు విదిందింది. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా