ఎల్జి పాలిమర్స్ కంపెనీ తరలించాలని మిన్నంటిన ఆందోళన

విశాఖపట్నం (జనహృదయం ప్రతినిది రాజన్): విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన అనంతరం శనివారం ఐదు గ్రామాల ప్రజల్లో ఆందోళన మిన్నంటింది తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన రసాయన కంపెనీని తరలించాలని లేకుంటే తమ ఆందోళన ఆపేది లేదని ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను కంపెనీ గేటు ముందు నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు ముఖ్యమంత్రి కంపెనీని తరలిస్తామని స్పష్టమైన ప్రకటన చేసే వరకూ ఈ ఆందోళన కొనసాగిస్తామని అప్పటివరకు మృతదేహాలను మనం చేసే పరిస్థితి లేదంటూ తీవ్రస్థాయిలో ప్రజలంతా ఒకచోట చేరి ఆందోళన చేపట్టారు బాధితుల బంధువులు ప్రజలు ఆందోళనతో వెంకటాపురం ఎల్ జి పాలిమర్స్ ప్రాంగణమంతా భారీ జనసందోహంతో నిండి పోయి మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు వారి బాధితుల ఆవేదన కట్టలు తెంచుకొని మృతదేహాల పెద్ద విలపిస్తూ చేస్తున్న ఆందోళన కట్టడి చేయడం పోలీసు లకు సాధ్యపడలేదు సిపిఐ పార్టీ కూడా వీరికి మద్దతు పలకడంతో ప్రజలంతా కంపెనీని మూత మూసివేస్తేనే కానీ ఆందోళన విరమించి ప్రజల పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు కంపెనీ యాజమాన్యం ని అరెస్టు చేయాలని మృతదేహాల తో నిరసన తెలియజేస్తున్నారు ఒక దశలో పోలీసులు ఆందోళన ఎందుకు యువకులను పోలీసు వాహనాల్లో తరలిస్తున్నారు ఈ మేరకు భారీ ఎత్తున పోలీసు బలగాలను అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు


ఆందోళనతో చాలా సేపటివరకు  కంపన్య్లోనే  ఉండిపోయిన డిజిపి


బాధితుల ఆందోళనలో భాగంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఉదయం పరిశీలించేందుకు వచ్చిన డిజిపి చాలా సేపటి వరకు కంపెనీలోనే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అతి కష్టం మీద 45 నిమిషాల అనంతరం పోలీసులు డీజీపీని అక్కడినుంచి సిటీలో కి తరలించారు
కాగా ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిని పోస్టుమార్టం అనంతరం ఈరోజు ఉదయం మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు దీంతో మృతదేహాలను గ్రామాల్లోకి అంత్యక్రియల నిమిత్తం తీసుకొని రాగా మృతదేహాలను పట్టుకొని బాధితుల కోపం కట్టలు తెంచుకొని ఎల్జీ కంపెనీ దిశగా పయనమై తీవ్రస్థాయిలో ఆందోళన ఉపక్రమించింది ఒక దశలో కంపెనీ గేట్లను కొట్టుకొని వెళ్లేందుకు యువకులు ప్రయత్నించారు అది కష్టంపై పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు సుమారు గంటకు పైగా ఈ ఆందోళన కార్యక్రమం మృతదేహాలను గేటు ముందు నుంచి ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు


 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా