మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్...


విశాఖపట్నం (జనహృదయం): ఉద్యోగం లేదన్న బాధ తో మతిస్థిమితం కోల్పోయిన దురుసుగా  ప్రవర్తించిన సుధాకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విశాఖ మానసిక వైద్యశాలలో జాయిన్ చేశారు అక్కడి వైద్యులు డాక్టర్ సుధాకర్ కి వైద్య సేవలు అందిస్తున్నారు. శనివారం విశాఖ నగరంలో జాతీయ రహదారిపై ఉద్యోగం లేదని ఆక్రోశంతో ప్రభుత్వ యంత్రాంగంపై దుర్భాషలాడి దయనీయ పరిస్థితిలో పోలీసులు తీసుకెళ్లిన వైనం బాధాకరమైనప్పటికీ సుధాకర్ ప్రవర్తన తీరు సరైనది కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడిరోడ్డుపై సుధాకర్ ప్రవర్తనా తీరు విషమించడంతో స్థానికులు అతన్ని తాళ్లతో కట్టి పోలీసులకు అప్పగించారని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పేర్కొన్నారు.


వృత్తిరీత్యా డాక్టర్, గెజిటెడ్ హోదా కలిగిన సుధాకర్ను చేతులు వెనక్కు పెట్టి తాళ్లతో నిర్బంధించి మోకాళ్లపై ఆటోలో తీసుకెళ్లిన ఘటనపై ఇప్పటికే కానిస్టేబుల్ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.  కాగా మతిభ్రమించి ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషలాడటం సరైన పద్ధతి కాదని తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అన్యాయంగా విధుల నుంచి తొలగించడంతో మానసిక స్థైర్యం కోల్పోయిన సుధాకర్ ఈ విధంగా ప్రవర్తించడానికి ప్రభుత్వమే కారణమని కొన్ని వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.


కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న సుధాకర్ని కేజిహెచ్ వైద్యుల సూచనల మేరకు మానసిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనతో వైద్యాధికారి సుధాకర్ ని పరామర్శించేందుకు వెళ్లిన వారితో ఆయన మాట్లాడుతూ తన ఉద్యోగాన్ని ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా