దేశంలో పౌరులంతా సామాజిక దూరం... వ్యక్తిగత భద్రత పాటించకుంటే ప్రమాదమే...


ఎవరికి వారు వ్యక్తిగత భద్రత కోసం కఠిన నిర్ణయం తీసుకోవలిందే….


చైనాను దాటిపోయిన భారత్ కరోనా పోజిటివ్ కేసులు..


న్యూడిల్లీ (జనహృదయం) :  భారత్లో కరోనా కేసులు విజృంభిస్తుంది చైనాను దాటిపోయాయి కరోనా పుట్టినిల్లు చైనాలో 82 వేల కేసులు ఇప్పటివరకు నమోదవగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎనభై ఆరు వేలకు అతి దగ్గరలో ఉంది ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత మూడు విడతలుగా లాక్ డౌన్ ప్రకటించి నాలుగో విడత లాక్ డౌన్లోడ్ తొలగించే దిశగా అడుగులు వేస్తున్నారు అయినప్పటికీ మనదేశంలో పౌరులు ప్రభుత్వాలకి పూర్తిగా సహకరించకపోవడంతో కరోనా కేసులు చైనా నే మించి పోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా ని సైతం దాటేందుకు ఎంతో దగ్గరలో ఉన్నామా అనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి గత వారం రోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా మూడు నుండి నాలుగు వేల పాజిటివ్ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి సంఖ్య ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో 12వ స్థానంలో ఉన్న భారత్ మొదటి ఐదు స్థానాలకు చేరుకుంటుంది ఏమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య లో 12వ స్థానం కాగా రోజువారీ నమోదయ్యే కేసుల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది.


ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడంలో భాగంగా ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపు ప్రజలు దుర్వినియోగం చేయకుండా అవసరమైతేనే కానీ బయటకు రాకుండా ఇల్లే ప్రపంచంగా భావించి సామాజిక దూరం పాటిస్తే తప్ప ఈ మహమ్మారిని కట్టడి చేయలేమన్నారు విషయం ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.
దేశంలో ఇప్పటి వరకు 85 వేల 940 పాజిటివ్ కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 53035 గా వున్నాయి ఇక మరణాల సంఖ్య మూడు వేలకు చేరువలో 2,752 గా నమోదయింది
ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2205 కాగా 803యాక్టివ్ కేసులు ఉన్నాయి మృతుల సంఖ్య 49గా ఉంది కాగా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య మెరుగ్గా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వారు వలసలతో కేసులు పెరుగుతున్నాయి అలాగే దేశంలోనే కరోనా పరీక్షల్లో చేయడంలో ఏపీ మొదటి స్థానంలో ఉండటం కూడా కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.


తెలంగాణలో కరోనా 1,454 మందికి వ్యాప్తి చెందగా 461 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతూ ఉన్నాయి ఇప్పటివరకు 34 మందతలెత్తుతున్నాయి. మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు ఢిల్లీ లో ఈ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా