ఎల్జి పాలిమర్స్ బాధితులకు నష్టపరిహారం అందించిన మంత్రులు

విశాఖపట్నం  (జన హృదయం): విశాఖలో ఎల్జి పాలిమర్స్గ్ గ్యాస్ ‌ లీకేజీతో మృతుల కుటుంబాలకు  రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ను ఏపీ మంత్రులు సోమవారం అందించారు . ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న. బాధితులను మంత్రుల బృందం పరామర్శించింది.  గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారిలో ఐదు కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు అందజేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలు గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు.


గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో మంత్రులు ఈ రోజు రాత్రి బస చేసి  ఆయా గ్రామాల్లో  ప్రజలకు  భరోసా కల్పించి వారికి ధైర్యం చెప్పేందుకు మంత్రులు నిర్ణయించారు. వి శాఖలోని ఆర్.ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్‌ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


ఈ ఘటనలో బాధితులకు ప్రకటించిన నష్ట పరిహారాన్ని ఏపీ మంత్రులు ఈ రోజు ఉదయం అందజేశారు.  కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శించారు.


ఏపీలో పారిశ్రామిక ప్రాంతాల వద్ద భద్రతకు సంబంధించిన ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నామని మంత్రి కన్నబాబు వివరించారు.  సీఎం జగన్‌ చేసి సూచనల మేరకు ఏపీ మంత్రులు ఈ రోజు రాత్రి ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో బస చేస్తారని కన్నబాబు తెలిపారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా