నిపుణుల పరిశీలనతో ప్రజలను అనుమతిస్తాం

జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు వెల్లడి


విశాఖపట్నం (జనహృదయం):  విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అక్కడి ప్రజలను అనుమతిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు ఎల్జి పాలిమర్స్ ఘటన అనంతరం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఇప్పటికే చాలా మంది కోరుకుంటున్నారని వారిలో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు ఐదు గ్రామాల్లోని పరిశీలిస్తున్నామని ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ నిపుణుల కమిటీ ఈ రోజు మధ్యాహ్నం నుండి విశాఖ రానుందని వారు పరిశీలించిన అనంతరం నివేదిక ఆధారంగా ప్రజలను వారి ఇళ్లకు అనుమతిస్తామని అప్పటి వరకు వారికి కావలసిన వసతి సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుందని పేర్కొన్నారు


బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు చేపట్టామని ఇప్పటికే ప్రభుత్వం 30కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రచారం బాధితులందరికీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని అన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విశాఖ లోనే ఉండి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడతారని మంత్రి కన్నబాబు తెలిపారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా